స్క్రిప్టులో తలమునకలుగా... గబ్బర్‌సింగ్-2
కొన్ని సినిమాలు కథాచర్చల సమయం నుంచే వార్తల్లో నిలుస్తాయి. కానీ, షూటింగ్‌కు వెళ్ళకుండా స్క్రిప్టు రూపకల్పన దశలోనే నెలలకొద్దీ ఒక సినిమా వార్తల్లో ఉండడం, దాని కోసం అభిమానులు ఆసక్తిగా చర్చించుకోవడం అరుదైన విషయమే. పవన్ కల్యాణ్ సూపర్‌హిట్ ‘గబ్బర్‌సింగ్’కు కొనసాగింపు ‘గబ్బర్‌సింగ్ 2’కు ఇటీవల ఆ ఘనత దక్కింది. రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళకుండానే ఇప్పటికి చాలారోజులుగా వార్తల్లో నిలిచిన ఈ సినిమా గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తూ వస్తోంది.
పవన్ కల్యాణ్ మిత్రుడైన శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకరిద్దరి తరువాత ఇప్పుడు ‘బలుపు’ ఫేమ్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) సారథ్యంలో సాగుతోంది. అయితే, ఈ సినిమా ప్రతిపాదన దాదాపు ఆగిపోయినట్లేనంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల కోసం ప్రయత్నించినప్పుడు ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఈ ‘గబ్బర్‌సింగ్ 2’ స్క్రిప్టు విషయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు, సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారట. ‘‘స్క్రిప్టు పని జరుగుతోంది. భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం’’ అని శరత్‌మరార్ వివరించారు. నిజానికి, మీడియాలోని వార్తల నేపథ్యంలో ముందుగా షూటింగ్ మొదలుపెట్టి, కొద్ది రోజులు జరిపి, ఊహాగానాలకు తెర దించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ, పవన్ మాత్రం అలా వద్దనీ, పూర్తి స్క్రిప్టుతో, లొకేషన్లను కూడా పక్కాగా నిర్ణయించుకొని ఏకధాటిగా షూటింగ్ జరుపుదామనీ దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పినట్లు అభిజ్ఞవర్గాల కథనం.
కాగా, డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ పవన్ చెప్పిన మాట నిజమే కానీ, దానికీ ఈ ‘గబ్బర్ సింగ్2’కూ సంబంధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి, ‘గబ్బర్ సింగ్2’ అటకెక్కినట్లేననీ, ‘గోపాల గోపాల...’ దర్శకుడు డాలీని స్క్రిప్టుతో రమ్మనమని కోరింది ఈ సినిమాకేననీ వస్తున్న వార్తలు తప్పని తేలింది. అంటే... ‘గబ్బర్ సింగ్2’ బాబీతో ఉన్నట్లే! కానీ, చిత్ర ప్రారంభం కోసం మాత్రం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.